Neha Sharma: అందాలతో హాహాకారాలు పెట్టిస్తున్న నేహా!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహాశర్మ.. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది.

Neha Sharma: అందాలతో హాహాకారాలు పెట్టిస్తున్న నేహా!

Neha Sharma (image:Instagram)

Updated On : August 16, 2021 / 9:40 PM IST

Neha Sharma: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహాశర్మ.. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది.


కానీ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌లో పాగా వేసింది.


మరోవైపు కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.


బాలీవుడ్‌లో ఇమ్రాన్ హస్మీ సరసన ‘క్రూక్’ సినిమాలో హాట్‌గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్న నేహా.. ఆఫర్ల కోసం సోష‌ల్ మీడియాని న‌మ్ముకుని వ‌రుస ఫొటో షూట్‌ల‌తో ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించేస్తోంది.


నేహా షేర్ చేసే ఫొటోలు నెటిజ‌న్స్‌కి పిచ్చెక్కించేస్తుంటాయి. అయినప్పటికీ అమ్మడి అందానికి అభినయానికి తగిన అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి.


మరి ఇప్ప‌టికైనా సినీ మేకర్స్ నేహా టాలెంట్‌ని గుర్తించి ఆమెకు త‌గ్గ ఆఫ‌ర్లు ఇవ్వకపోతే నేహా హాట్ షో హ‌ద్దులు దాటే ప్ర‌మాదం వుంద‌ని నెటిజ‌న్స్ వ‌రుస కామెంట్లు చేస్తున్నారు.