రేపే నిఖిల్ పెళ్లి.. నిబంధనలు ప్రకారమే!

కరోనా దెబ్బకు అన్నీ రంగాలు ఆగిపోయాయి. సినిమా ఇండస్ట్రీ కూడా షూటింగులు ఆపేసుకున్నాయి. అయితే తెలుగు కుర్ర హీరోల పెళ్లిళ్లు కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ పెళ్లి వాయిదా పడగా.. నిఖిల్ వివాహం కూడా పలుమార్లు వాయిదా పడింది.
అయితే రేపు(14 మే 2020) ఎట్టకేలకు నిఖిల్ పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి తను ప్రేమించిన పల్లవి వర్మను పెళ్లి చేసుకోబోతున్నాడు. షామిర్ పెట్ గెస్ట్ హౌస్‌లో రేపు ఉదయం 6గంటల 10 నిమిషాలకు నిఖిల్ పెళ్లి జరగబోతుంది
లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరగబోతుంది. ఈరోజు రాత్రికి నిఖిల్‌ని పెళ్లి కొడుకును చేయబోతున్నారు కుటుంబ సభ్యులు.
అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకున్న నిఖిల్.. ప్రస్తుతం కార్తికేయ సినిమా సీక్వెల్ చేస్తున్నాడు. అంతేకాకుండా సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 18 పేజీస్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
Read More:
* ప్రియురాలిని పరిచయం చేసిన రానా!