Delhi: మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్టడీ ఈ నెల 13 వరకు పొడిగింపు
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఈ నెల 13 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలోనే ఉండనున్నారు. నగదు అక్రమ చలామణీ కేసులో ఆయనను మే 30న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Satyendra Jain
Delhi: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఈ నెల 13 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలోనే ఉండనున్నారు. నగదు అక్రమ చలామణీ కేసులో ఆయనను మే 30న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు అప్పట్లో ఢిల్లీలోని కోర్టు ప్రకటించింది. ఆ గడువు ముగియడంతో మరికొన్ని రోజులు కస్టడీకి అప్పగించాలని ఈడీ విజ్ఞప్తి చేసింది.
Prophet remark row: భారత్ స్పందించిన తీరుపై ఇరాన్ సంతృప్తి
ఇటీవల సత్యేందర్ జైన్ ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన దాడుల్లో రూ.2.82 కోట్ల నగదు, 133 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ నెల 13 వరకు ఆ గడువును పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 2015-16లో కోల్‌కతాలోని సత్యేందర్ జైన్ సంస్థలకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.
Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలకు నేడు షెడ్యూల్
అయితే, సత్యేందర్ జైన్‌ను బీజేపీ కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించారు. సత్యేందర్ జైన్ చాలా నిజాయితీపరుడని, సేవా దృక్పథం ఉన్నవారని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ తదుపరి లక్ష్యం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అని, ఆయనను త్వరలోనే అవినీతి కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.