Presidential Election: రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు నేడు షెడ్యూల్‌

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నేడు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేయ‌నుంది. గ‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌లు 2017 జూలై 17న జ‌రిగాయి. అనంత‌రం, అదే నెల 20న వాటి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం వ‌చ్చే నెల 24న ముగియ‌నుంది.

Presidential Election: రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు నేడు షెడ్యూల్‌

Assembly Election Results 2022 Election Commission Lifts Ban On Victory Processions (2)

Presidential Election: రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నేడు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేయ‌నుంది. గ‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌లు 2017 జూలై 17న జ‌రిగాయి. అనంత‌రం, అదే నెల 20న వాటి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం వ‌చ్చే నెల 24న ముగియ‌నుంది.

Prophet row: నురూప్ శర్మతో పాటు మ‌రో ఏడుగురిపై ఢిల్లీలో కేసులు

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 62 ప్ర‌కారం రాష్ట్రప‌తి ప‌ద‌వీ కాలం ముగిసే ముందే త‌దుప‌రి రాష్ట్రప‌తి కోసం ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల విష‌యంలో ఆయా పార్టీలు తీసుకునే నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కొంది. గ‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ రామ్‌నాథ్ కోవింద్‌ను, యూపీఏ మీరా కుమార్‌ను పోటీలో నిలిపిన విష‌యం తెలిసిందే.

Prophet remark row: భార‌త్ స్పందించిన‌ తీరుపై ఇరాన్ సంతృప్తి

కాగా, రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 58 ప్ర‌కారం రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారికి ప‌లు అర్హ‌త‌లు ఉండాలి. అభ్య‌ర్థి భార‌తీయ పౌరుడై, 35 లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు క‌లిగి ఉండాలి. గ‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేసేముందు రామ్‌నాథ్ కోవింద్ బిహార్ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగిన విష‌యం తెల‌సిందే. ఆయ‌న 2015, ఆగ‌స్టు 16 నుంచి 2017 జూన్ 20 వ‌ర‌కు బిహార్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు.

Drone: జ‌మ్మూక‌శ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వద్ద డ్రోను క‌ల‌క‌లం

రాష్ట్రపతి ఎన్నికకు ప‌లు నిబంధ‌న‌లు ఉంటాయి. ఆయా పార్టీలు తమ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయొద్దు. అలాగే, రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌ ఓటింగ్ బ్యాల‌ట్ పేప‌ర్ విధానంలో నిర్వ‌హిస్తారు. గ‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 7,02,044 (65.65 శాతం) ఓట్లు వ‌చ్చాయి. అలాగే, యూపీఏ నుంచి పోటీ చేసిన మీరా కుమార్‌కు 3,67,314 (34.35 శాతం) ఓట్లు వచ్చాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఎన్డీఏకు బ‌య‌టి నుంచి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌, ఏపీలోని పార్టీ వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చాయి. ఈ సారి కూడా ఆ రెండు పార్టీలు ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఇస్తాయా? అన్న విషయంపై స్ప‌ష్ట‌త‌లేదు.