Drone: జ‌మ్మూక‌శ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వద్ద డ్రోను క‌ల‌క‌లం

జ‌మ్మూక‌శ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (ఐబీ) వ‌ద్ద పాకిస్థాన్ డ్రోను క‌ల‌క‌లం రేపింది. దాన్ని గుర్తించిన స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం (బీఎస్ఎఫ్‌) కాల్పులు జ‌ర‌ప‌డంతో అది తోక‌ముడిచి వెన‌క్కి వెళ్లిపోయింది.

Drone: జ‌మ్మూక‌శ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వద్ద డ్రోను క‌ల‌క‌లం

Drone Attack

Drone: జ‌మ్మూక‌శ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (ఐబీ) వ‌ద్ద పాకిస్థాన్ డ్రోను క‌ల‌క‌లం రేపింది. దాన్ని గుర్తించిన స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం (బీఎస్ఎఫ్‌) కాల్పులు జ‌ర‌ప‌డంతో అది తోక‌ముడిచి వెన‌క్కి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై సంబంధిత అధికారులు మీడియాకు వివ‌రాలు తెలిపారు. జ‌మ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో గురువారం తెల్ల‌వారుజామున 4.15 గంట‌ల‌కు భూమి నుంచి దాదాపు 300 మీట‌ర్ల ఎత్తులో డ్రోనుకు సంబంధించిన ఓ లైటు మెరుస్తూ క‌న‌ప‌డింద‌ని వివ‌రించారు.

Prophet remark row: భార‌త్ స్పందించిన‌ తీరుపై ఇరాన్ సంతృప్తి

ఈ విష‌యాన్ని గుర్తించిన స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం కాల్పులు జ‌రిపింద‌ని చెప్పారు. దీంతో ఆ డ్రోను వెన‌క్కి వెళ్లిపోయింద‌ని అధికారులు తెలిపారు. అయితే, ఆ డ్రోను అప్ప‌టికే అర్నియా ప్రాంతంలో ఏవైనా ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల వంటివి జార‌విడిచిందా? అన్న అనుమానంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు.

Prophet remarks row: మాట్లాడేముందు పార్టీ నేత‌లు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి: బీజేపీ

జ‌మ్మూక‌శ్మీర్‌లోని వేర్పాటు వాదులు, ఉగ్ర‌వాదుల‌కు పాక్ డ్రోన్ల సాయంతో ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల వంటివి పంపుతూ వారికి సాయం చేస్తోంది. ఈ చ‌ర్య‌ల‌పై భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు నిఘా ఉంచారు. ఇప్ప‌టికే పాక్ నుంచి వ‌చ్చిన ప‌లు డ్రోన్ల‌ను కుప్ప‌కూల్చారు. స‌రిహ‌ద్దుల్లోకి పాక్‌ డ్రోన్ల‌ను పంపుతున్న ఘ‌ట‌న‌లు ఇటీవల పెరిగిపోయాయి. డ్రోన్ల సాయంతో దాడులు చేయడానికి కూడా పాక్ కుట్రలు పన్నుతోంది.