Karnataka: లాక్‌డౌన్ ఆంక్షలు మరికాస్త సడలించిన ప్రభుత్వం!
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నుండి ఇప్పటికే చాలా రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విముక్తి పొందగా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఇంకా ఆంక్షల అమల్లోనే ఉన్నాయి. అందులో కర్ణాటక రాష్ట్రం కూడా ఒకటి.

Karnataka
Karnataka: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నుండి ఇప్పటికే చాలా రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విముక్తి పొందగా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఇంకా ఆంక్షల అమల్లోనే ఉన్నాయి. అందులో కర్ణాటక రాష్ట్రం కూడా ఒకటి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూతో పాటుగా వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుంది.
ఇప్పటి వరకు శని, ఆదివారాలు పూర్తిగా కర్ఫ్యూలో ఉండగా ఇప్పుడు మరికాస్త సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఆంక్షలు మరికాస్త సడలిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుండి వారాంతపు కర్ఫ్యూను ఎత్తేసిన ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను మాత్రం యధావిధిగా అమలు చేయనున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుండగా ప్రభుత్వ కార్యాలయాలను కూడా తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఇక.. ప్రస్తుతానికి విద్యాసంస్థలపై ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం తదుపరి ఉత్తర్వుల వరకు వీటికి అనుమతి లేదని ప్రకటించింది.