Icc One Day Ranking : కోహ్లీ నెంబర్ వన్, రోహిత్ సెకండ్ ప్లేస్

  • Published By: madhu ,Published On : December 11, 2020 / 08:08 AM IST
Icc One Day Ranking : కోహ్లీ నెంబర్ వన్, రోహిత్ సెకండ్ ప్లేస్

Updated On : December 11, 2020 / 9:38 AM IST

ODI Batting Rankings : ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్స్ అదరగొట్టారు. భారత జట్టు కెప్టెన్ కోహ్లీ తన నెంబర్ వన్ ప్లేసను నిలబెట్టుకున్నాడు. ఆసీస్‌తో చివరి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో రాణించడంతో కోహ్లీ 870 పాయింట్లతో టాప్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. ఇటు గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 842 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచాడు. టాప్‌ 10లో ఈ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.



బౌలింగ్ విభాగంలో 722 పాయింట్లతో న్యూజిలాండ్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. భారత యంగ్ బౌలర్ బుమ్రా 700 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. బుమ్రా తర్వాత టాప్ 10లో కానీ టాప్ 20లో కానీ ఏ భారత జట్టు బౌలర్ నిలవలేదు. ఆల్ రౌండర్ల కోటాలో బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ నెంబర్ వన్‌గా ఉండగా.. భారత్ జట్టు తరఫున రవీంద్ర జడేజా టాప్ 8 ప్లేస్ దక్కించుకున్నాడు. జడ్డూ ఖాతాలో 253 పాయింట్లు ఉన్నాయి. ఇటు వన్డే సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల ర్యాంకులు కూడా భారీగా మారాయి.
బాబర్ అజామ్ (పాకిస్తాన్ 837) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాడు.



ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో 90, మూడో మ్యాచ్ లో 92 పరుగులు చేసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (553 పాయింట్లు) కెరీర్ లో తొలిసారి బ్యాట్స్ మెన్ ర్యాకింగ్స్ లో టాప్ – 50 లోకి రావడం విశేషం. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (700 పాయింట్లు), మూడో స్థానంలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (722 పాయింట్లు), అప్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ (701 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.