Lunar Eclipse 2022 : హైదరాబాద్‌లో పాక్షికంగానే చంద్రగ్రహణం.. సాయంత్రం ఏ సమయానికి ప్రారంభమవుతుందంటే?
దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్ లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 7.26 గంటలకు ముగుస్తుంది. 1.46గంటల పాటు గ్రహణం ఉంటుంది.

Chandra grahan2022
Lunar Eclipse 2022 : ఈ ఏడాది చివరిలో చంద్రగ్రహణం ఇవాళ కనిపించనుంది. చివరి నెలల్లో కనిపించే చంద్రగ్రహణం ప్రత్యేకమైనదిగా ప్రజలు నమ్ముతారు. గ్రహణం సందర్భంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలను మూసివేశారు. ఈరోజు చంద్రగ్రహణానికి ప్రత్యేకతలు ఉన్నాయి. సాయంత్రం సమయంలో భారతదేశంలో కూడా చంద్రగ్రహణం కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని తూర్పు ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణం చూడొచ్చు. ఈ ఏడాదిలో ఇది రెండో చంద్రగ్రహణం.
2022 సంవత్సరంలో ఇది చివరి, రెండవ చంద్రగ్రహణం. ఈ రోజు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి కూడా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు, సూర్యుని కిరణాలు చంద్రుడిని చేరుకోలేవు. ఈ ఖగోళ సంఘటనను చంద్రగ్రహణం అంటారు. భారతదేశంలో సాయంత్రం 5.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సాయంత్రం 6.20 గంటలకు ముగుస్తుంది. గ్రహణానికి 9 గంటల ముందు అంటే ఉదయం 8.20కు సూతక్ కాలం ఏర్పడుతుంది. గ్రహణంలో సూతకాలాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత ప్రజలు గంగానదిలో స్నానం చేస్తారు. అనంతరం ఇష్ట దైవాన్ని పూజించి ఆ తరువాత ఆహారం తీసుకుంటారు.
Lunar Eclipse 2021 : కార్తీక పౌర్ణమికి చంద్రగ్రహణం ఉందా? లేదా ?
దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్ లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 7.26 గంటలకు ముగుస్తుంది. 1.46గంటల పాటు గ్రహణం ఉంటుంది.