Missing pet dog : తప్పిపోయిన కుక్కను తెచ్చిస్తే రూ.25,000 బహుమతి
తప్పిపోయిన పెంపుడు కుక్కను తెచ్చిస్తే రూ.25వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు దాని యజమాని. కుక్క వయస్సు 13 ఏళ్లు. దాని పేరు ‘చమేలీ’.అని నా చమేలీని తెచ్చిస్తే రూ.25వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.

Pet dog missing for a month owner pitches Rs.25,000 reward
Missing pet dog : తప్పిపోయిన పెంపుడు కుక్కను తెచ్చిస్తే రూ.25వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు దాని యజమాని. కుక్క వయస్సు 13 ఏళ్లు. దాని పేరు ‘చమేలీ’.అని నా చమేలీని తెచ్చిస్తే రూ.25వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు ఢిల్లీకి చెందిన వ్యక్తి. అతని పేరు అనుప్రియా దాల్మియ. 13 ఏళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క తప్పిపోవడంతో యజమాని కన్నీరు పెట్టుకున్నారు. నా చమేలీని తెచ్చిస్తే మీరుణం ఉంచుకోను రూ.25వేలు ఇచ్చి తీర్చుకుంటానని ప్రకటించారు అనుప్రియ.
Parrot Missing : మా చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి..పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన
ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో నివాసం ఉండే అనుప్రియా దాల్మియ.. గత 13 ఏళ్లుగా ఓ కుక్కను పెంచుకుంటోంది. దానికి ప్రేమగా చమేలీ అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టి పిలిస్తే చాలు తోక ఊపుకుంటూ వచ్చే కుక్క కాస్తా కనిపించకుండాపోయింది.దీంతో అనుప్రియ బెంగపెట్టుకున్నారు. చాలా చోట్ల వెదికారు కానీ కనిపించలేదు. తెలిసినవారినల్లా అడిగారు కానీ ఫలితం లేదు. అక్టోబర్ 14న రాత్రి దీపావళి సందర్భంగా ఆ ప్రాంతంలో బాణాసంచా కాల్చగా ఆ బాణాసంచా పేలుడు శబ్ధాలకు భయపడిపోయిన చమేలీ ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి దాని కోసం అనుప్రియా వెతకని చోటంటూ లేదు.
Dog Missing : తప్పిపోయిన శునకం.. ఆచూకీ చెబితే రూ.5వేలు
అయినా కుక్కజాడ కనిపించకపోవడంతో బెంగపడిపోయారు. ఎక్కడుందో..తిండి తింటుందో లేదో.. అని తెగ దిగులు పెట్టేసుకున్నారు. దీంతో తన కుక్కను కనిపెట్టి తనకు అప్పగించిన వారికి అనుప్రియారూ.25,000వేలు బహుమతిగా అందజేస్తానని ప్రకటించింది. కుక్క ఆనవాళ్లు చెప్పి ఆచూకీ తెలిస్తే ఫోన్ చేయాలని నంబర్ కూడా ప్రకటించింది.
‘13 ఏళ్లుగా చమేలీ ఎంతో సురక్షిత జీవితాన్ని గడిపింది. తనను తాను ఎలా రక్షించుకోవాలో కూడా తెలియదు. చమేలీ కనిపించకపోవడంతో చాలా కలతచెందాము. చమేలీ ఆచూకీ తెలుసుకోవటానికి నాకు సాయం చేయండీ ప్లీజ్ అంటూ వాపోయారు. ఢిల్లీ పరిసరాల్లో ఎక్కడైనా కనిపిస్తే +919891027274 ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వగలరు. చమేలీ ఆచూకీ తెలిపిన వారికి రూ.25,000వేలు బహుమతిగా అందజేస్తా’ అని అనుప్రియా దాల్మియా తెలిపింది. దీంతోపాటు కుక్క ఫొటోలను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేసింది.