Gold locket for Cat Gift :పెంపుడు పిల్లికి రూ.4 లక్ష‌ల విలువైన గోల్డ్ లాకెట్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన యజమాని

పెంపుడు పిల్లి నాలుగవ పుట్టిన రోజు పార్టీని అత్యంత ఘనంగా చేసిందో మహిళ. పుట్టిన రోజు కానుకగా పిల్లికి రూ.4 లక్ష‌ల విలువైన గోల్డ్ లాకెట్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చింది.

Gold locket for Cat Gift :పెంపుడు పిల్లికి రూ.4 లక్ష‌ల విలువైన గోల్డ్ లాకెట్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన యజమాని

Gold Locket For Cat Gift

woman buys gold locket for her pet cat birthday gift : మలేషియాకు చెందిన ఓ మ‌హిళ త‌న పెంపుడు పిల్లికి పుట్టిన రోజు కానుకగా బంగారపు లాకెట్ ఇచ్చింది. రూ.4 ల‌క్ష‌లు విలువైన ఆ బంగారు లాకెట్ లవ్ సింబల్ మోడల్ లో ఉంది. తన ప్రేమను అంతా రంగరించి తన పెంపుడు క్యూట్ పిల్లికి ఆ లాకెట్ ని బ‌ర్త్‌డే గిఫ్టుగా ఇచ్చింది. అంతేకాదు తన క్యూట్ క్యాట్ కు బర్త్ డే పార్టీని వెరీ గ్రాండ్ గా జరిపించింది. పెంపుడు జంతువులకు ఇలా బర్త్ డేలు చేస్తుంటారు చాలా మంది. కానీ ఆ పిల్లికి ఇచ్చిన కాస్ట్లీ గిప్టు..గ్రాండ్ పార్టీ మలేషియాలో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Raad more : Dog Missing : తప్పిపోయిన శునకం.. ఆచూకీ చెబితే రూ.5వేలు

హ‌లిజా మైసూరీ భర్త  వ్యాపారవేత్త. ఆమె ఓ పిల్లిని కొని దాన్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. దానికి ‘మని’అని పేరు పెట్టింది. దాన్ని సంరక్షణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. అలా తన పెంపుడు పిల్లికి నాలుగవ పుట్టిన రోజును అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వ‌హించింది. మనీ కోసం అదేనండి పెంపుడు పిల్లి కోసం హలిజా ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్ట‌డం త‌న‌కు ఇదే కొత్తేమీ కాదు…కాస్ట్లీ కాస్ట్లీ గిప్టులు దానికి కొనిస్తుంటుంది. మరి అది వాటిని ఏం చేసుకుంటుందో గానీ తన మనీపై హలిజాకు ఉన్న ప్రేమ అంటుంది. తాజాగా ఆ పిల్లి బ‌ర్త్‌డే రోజు హ‌లిజా, త‌న భ‌ర్త‌..అంబాంగ్‌లోని హబీబ్ జ్యువెల్ స్టోర్ నుండి సుమారు రూ.4.5 ల‌క్ష‌ల విలువైన గోల్డ్ లాకెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వటంతో ఆమె బంధువులు,స్నేహితులు సన్నిహితులు అంతా షాక్ అయ్యారు.

హ‌లిజాకు మనీ అనే పిల్లి కాకుండా ఆమెకు మ‌రో రెండు పిల్లులు కూడా ఉన్నాయ‌ట‌. ఆమె వెకేష‌న్‌కు వెళ్లినా.. ఎక్క‌డికి వెళ్లినా పెట్ క్యాట్స్‌ను కూడా త‌న‌తో పాటే తీసుకెళ్తుంది. అవి లేకుండా ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేద‌ట హ‌లిజా. ఈ పిల్లుల బట్టల కోసం ఈ జంట కూడా వేలల్లో ఖర్చు పెడుతుంది. అంతేకాదు..ఆ పిల్లుల్ని బ్యూటీ పార్లర్ కూడా తీసుకెళుతుంది. అంతేకాదండోయ్..స్పా ట్రీట్‌మెంట్స్‌ను కూడా చేయిస్తుంది.

Raad more : International Dog Day : ఈ కుక్కలు వెరీ కాస్ట్లీ గురూ..

త‌న పెంపుడు పిల్లుల‌కు విషయాలన్నీ హలీజా తన సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ పిల్లుల వీడియోలకు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. అలాగే తన క్యూట్ క్యాట్‌ మనీకి కొనిచ్చిన గోల్డ్ లాకెట్‌ను త‌న టిక్‌టాక్ అకౌంట్‌లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.

Read more : Woman Scarf Made with Dogs Fur : పెంపుడు కుక్క‌ల బొచ్చుతో స్కార్ఫ్‌..మెడలో వేసుకుని మురిసిపోతున్న యజమాని