PSPK : పవర్‌స్టార్ రేర్ పిక్ చూశారా..!
రీసెంట్‌గా పవర్‌స్టార్ రేర్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.. రగ్డ్ లుక్‌లో, స్టైలిష్ గాగుల్స్‌తో పవర్‌స్టార్ లుక్ ఆకట్టుకుంటోంది..

Powerstar Pawan Kalyan Unseen Pics Goes Viral
PSPK: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రీ ఎంట్రీలో ‘వకీల్ సాబ్’ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశారో చూశాం.
ఫస్ట్ సినిమా ‘అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి’ టైంలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్‌తో ఉన్న పవన్ పిక్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
రీసెంట్‌గా పవర్‌స్టార్ అన్‌సీన్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రగ్డ్ లుక్‌లో, స్టైలిష్ గాగుల్స్‌తో పవర్‌స్టార్ లుక్ ఆకట్టుకుంటోంది. అప్పట్లో పవన్ పాపులర్ కూల్ డ్రింక్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ టైంలో తీసిన పిక్ కూడా వైరల్ అవుతోంది.
క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ ఫిలిం ‘హర హర వీరమల్లు’ తో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లోనూ నటిస్తున్న పవన్ వరుసగా సినిమాలు లైనప్ చేశారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత సెలెక్టెడ్ థియేటర్లలో ‘వకీల్ సాబ్’ మూవీని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.