బన్నీని కలిసింది కె.జి.యఫ్ 2 కోసమే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కె.జి.యఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి త్వరలో కె.జి.యఫ్ 2 మూవీతో రికార్డ్స్ సృష్టించడానికి రెడీ అవుతూ.. రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రూపొందబోతోంది అనే వార్త మీడియా అండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

బన్నీని కలిసింది కె.జి.యఫ్ 2 కోసమే!

Updated On : March 11, 2021 / 8:15 PM IST

Allu Arjun – Prashanth Neel: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కె.జి.యఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి త్వరలో కె.జి.యఫ్ 2 మూవీతో రికార్డ్స్ సృష్టించడానికి రెడీ అవుతూ.. రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రూపొందబోతోంది అనే వార్త మీడియా అండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Allu Arjun - Prashanth Neel

అల్లు అర్జున్‌ని, ప్రశాంత్ నీల్ కలిసి బయటకొస్తుండగా కెమెరాలు క్లిక్ మనిపించారు. దీంతో ఈ పిక్స్‌తో పాటు బన్నీ, ప్రశాంత్ కాంబోలో ఓ క్రేజీ పాన్ ఇండియా సినిమా రానుందంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అసలు విషయం ఏంటంటే ప్రశాంత్, స్టైలిష్ స్టార్‌ని కలిసింది సినిమా గురించి కాదట..

Prashanth Neel

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో ప్రశాంత్, బన్నీని కలిశారు. ఇద్దరు కాసేపు తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నారు. అల్లు అర్జున్‌ని కె.జి.యఫ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాల్సిందిగా ప్రశాంత్ నీల్ కోరగా ఆయన వస్తానని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌లో కెజియఫ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.

KGF 2