Pregnant Died: ఇంటి పైకప్పు కూలి గర్భిణి మృతి

తమిళనాడులోని తూతుక్కూడిలో దారుణం జరిగింది. ఇంటి పైకప్పు కూలిపోవడంతో గర్భిణి, ఆమె తల్లి మరణించారు.

Pregnant Died: ఇంటి పైకప్పు కూలి గర్భిణి మృతి

Pregnant Died

Updated On : May 3, 2022 / 5:05 PM IST

Pregnant Died: తమిళనాడులోని తూతుక్కూడిలో దారుణం జరిగింది. ఇంటి పైకప్పు కూలిపోవడంతో గర్భిణి, ఆమె తల్లి మరణించారు. మంగళవారం తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఈ ఘటన జరిగింది. మృతులను కలియమ్మల్, కార్తీకగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణి అయిన కార్తీక గతవారమే తూతుక్కుడిలో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. కార్తీక, తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం ఉదయం ఉన్నట్లుండి పై కప్పు కూలిపోయింది.

Vijayawada Crime: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

ఈ ఘటనలో కార్తీక, ఆమె తల్లి అక్కడికక్కడే మరణించారు. అయితే, కార్తీక తండ్రి ముత్తురామన్ మాత్రం గాయాలతో బయటపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని, గంటల తరబడి శ్రమించి శిథిలాలు తొలగించే ప్రయత్నం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న ముత్తురామన్‌ను రక్షించి, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్తీక, కలియమ్మల్ మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.