congress: రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు.. టీఆర్ఎస్, వైసీపీతోనూ చర్చలు!
రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశంలోని విపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టంది. రాష్ట్రపతి ఎన్నికకు మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుండడంతో అభ్యర్థి ఎంపిక ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Rashtrapati Bhavan
congress: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశంలోని విపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టంది. రాష్ట్రపతి ఎన్నికకు మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుండడంతో అభ్యర్థి ఎంపిక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉమ్మడి అభ్యర్థి కోసం ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, ఆర్జేడీ, జేడీఎస్,ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోంది. అంతేకాదు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీతోనూ రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉంది.
Rajya Sabha Polls: సత్తా చాటిన బీజేపీ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
అలాగే, బీజేడీతోనూ సంప్రదింపులు జరపనుంది. ఎన్డీయేతర పార్టీలతో సంప్రదింపులకు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దించారు. అలాగే, రేపు ఢిల్లీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెళ్లనున్నారు. విపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై సోనియా సహా విపక్ష పార్టీల నేతలతో ఆయన చర్చించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి గురించి నిన్న వామపక్ష నేతలతో మల్లిఖార్జున ఖర్గే ఫోనులో మాట్లాడారు. ముంబైలో శరద్ పవర్ ను మల్లిఖార్జున ఖర్గే కలిశారు.
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.. అర్హులెవరు
త్వరలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌ని మల్లిఖార్జున ఖర్గే కలుస్తారు. కాంగ్రెసేతర వ్యక్తిని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా, జూన్ 29న రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. జూలై 21న ఫలితాలు వెల్లడవుతాయి. జూలై 24తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 4,809 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో రాజ్యసభ సభ్యులు 233, లోక్‌సభ సభ్యులు 543, ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.