Project K: కొత్తవారికి ప్రాజెక్ట్ K అవకాశం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఇటీవల బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకులు నెగెటివ్....

Project K: కొత్తవారికి ప్రాజెక్ట్ K అవకాశం!

Project K Team Announces Casting Call

Updated On : April 1, 2022 / 2:57 PM IST

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఇటీవల బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకులు నెగెటివ్ మార్కులు వేయడంతో ‘రాధేశ్యామ్’ బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చినట్లు సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా చేస్తోంది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే, తన నెక్ట్స ప్రాజెక్టులను వరుసగా తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే హిస్టారికల్ మూవీని తెరకెక్కిస్తున్న ప్రభాస్, ఆ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ అనే సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించాడు. ఇక ఆ తరువాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ K అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను తెరకెక్కించాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాత అశ్వనీ దత్ రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా ఎలాంటి అప్‌డేట్ మాత్రం ఈ చిత్ర యూనిట్ నుండి రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

కాగా తాజాగా ప్రాజెక్ట్ K చిత్ర యూనిట్ కొత్తవారికి అవకాశాలను ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో నటించేందుకు కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్‌ను అనౌన్స్ చేసింది. అన్ని వయసుల వారికి ఈ అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌ను ఏప్రిల్ 3,4వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Project K : ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి ఆనంద్ మహేంద్ర.. నాగ్ అశ్విన్ ట్వీట్‌కి రిప్లై..

ఈ అవకాశాన్ని ఆసక్తిగలవారు తప్పకుండా వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ కోరింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఇక ఈ సినిమాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ట్యాలెంట్ ఉన్నవారు రెడీ అవుతున్నారు. కాగా పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Project K Team Announces Casting