Ashwini Puneeth Rajkumar : ఇది పునీత్ కోరిక అంటూ.. కన్నడ ప్రజలకు పునీత్ రాజ్‌కుమార్ భార్య లేఖ..
తాజాగా పునీత్ భార్య అశ్విని గంధద గుడి సినిమా గురించి కర్ణాటక ప్రజలని ఉద్దేశించి ఓ లేఖ రాసింది. ఆ లేఖని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈలేఖలో...............

Puneeth Rajkumar wife Ashwini special letter to kannada people
Ashwini Puneeth Rajkumar : దివంగ నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించి సంవత్సరం అవుతున్నా ఆయన్ని కర్ణాటక ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటున్నారు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం పునీత్ కి కర్ణాటక రత్న అవార్డుని ఇచ్చి సత్కరించింది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘గంధద గుడి’. కర్ణాటక అడవులు, కర్ణాటక అందాలని చూపిస్తూ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీగా తెరకెక్కింది ఈ సినిమా. ఇటీవల అక్టోబర్ 28న ఈ సినిమా రిలీజయింది. ఈ సినిమాని ప్రేక్షకులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా అభినందించారు. అమోఘవర్ష దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సినిమాకు పునీత్ భార్య అశ్వినీ నిర్మాతగా వ్యవహరించారు.
తాజాగా పునీత్ భార్య అశ్విని గంధద గుడి సినిమా గురించి కర్ణాటక ప్రజలని ఉద్దేశించి ఓ లేఖ రాసింది. ఆ లేఖని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈలేఖలో.. ”గంధద గుడి.. ఇది పునీత్ రాజ్‌కుమార్ కలల సినిమా. కర్ణాటక అడవుల గురించి, కర్ణాటక అందాలని అందరికి చూపించాలని ఆయన ఈ సినిమా చేశారు. కన్నడ ప్రజలంతా ఈ సినిమా చూడాలన్నది ఆయన కోరిక. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ సినిమా చూడాలని అప్పు కోరుకున్నారు. మన పిల్లల కోసం మన అడవులని కాపాడుకోవాలని, కర్ణాటక అడవులని వారికి తెలియచేయాలని ఆయన అనుకున్నారు”
”అలాగే ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో నేను డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ వారితో మాట్లాడాను. 7వ తేదీ సోమవారం నుంచి 10వ తేదీ గురువారం వరకు గంధద గుడి సినిమా టికెట్ రెట్లని తగ్గిస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో కేవలం 56 రూపాయలు, మల్టిప్లెక్స్ లో కేవలం 112 రూపాయలకే ఈ సినిమాని అందచేస్తున్నారు. కర్ణాటక ప్రజలంతా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ನಾಡಿನ ಜನತೆಯಲ್ಲಿ ನನ್ನ ಒಂದು ಮನವಿ…
An appeal to all the people of the state.#GGKids #GGMovie #GandhadaGudi #DrPuneethRajkumar pic.twitter.com/tf01Kt2Alu
— Ashwini Puneeth Rajkumar (@Ashwini_PRK) November 6, 2022