Puri Jagannadh : ఎవడు సినిమా తీస్తే డైలాగ్స్ జనాల్లోకి వెళ్ళిపోతాయో వాడే ‘పూరి’ గాడు.. బర్త్ డే స్పెషల్ స్టోరీ
ఎవడు కొడితే దిమ్మ తిరుగుద్దో వాడే పండుగాడు, సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చంటిగాడు లోకల్, నా పేరు శివమణి నాక్కొంచెం మెంటల్.. ఇలాంటి డైలాగ్స్

Puri
Puri Jagannadh : మాములుగా హీరోలకి వీరాభిమానులు ఉంటారు. కానీ డైరెక్టర్స్ కి కూడా వీరాభిమానులు ఉంటారు అని నిరూపించిన అతి తక్కువ మంది డైరెక్టర్స్ లో పూరి జగన్నాద్ ఒకరు. అభిమానులు తమ హీరోలని స్క్రీన్ పై ఎప్పుడూ కొత్తగా, స్పెషల్ గా చూడాలి అనుకుంటారు. చాలా మంది మాస్ హీరోగానే చూడాలి అనుకుంటారు. అలా అభిమానులకి నచ్చినట్టు చూపించే ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాధ్..
క్లాస్ హీరోలని మాస్ హీరోలుగా మార్చాలన్నా, చిన్న హీరోలతో హిట్లు కొట్టాలన్నా, ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించాలి అన్నా, స్పెషల్ సాంగ్స్ చేయాలన్నా, జీవితంలో జరిగే నిజాలని ముక్కుసూటిగా ఒక్క డైలాగ్ లో చెప్పాలన్నా, జనాల్లో తిట్టుకునే తిట్లను హీరోలకి, సినిమాలకి పేర్లుగా పెట్టాలన్నా పూరి జగన్నాద్ సినిమా తీయాలి. ఆ సినిమాని జనాల్లోకి వదలాలి.
అప్పటి దాకా క్లాస్ సినిమాలని తీసే పవన్ కళ్యాణ్ కి ఒక కొత్త మ్యానరిజం జోడించి ‘బద్రి’ అంటూ తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలోకి భద్రంగా వచ్చేసాడు. రవితేజతో ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి’ ఇలా వరుసగా మూడు సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టి రవితేజని స్టార్ హీరోని చేసాడు. నాగార్జునతో ‘శివమణి’ అంటూ అందరికి మెంటల్ ఎక్కించాడు. తన తమ్ముడ్ని హీరోగా పెట్టి ‘143’ అంటూ చిన్న సినిమాతో కొత్త హీరోతో కూడా హిట్ కొట్టాడు. ఇక మహేష్ బాబుతో ‘పోకిరి’ అంటూ వచ్చి అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాడు. అప్పటి వరకు క్లాస్ హీరోగా ఉన్న మహేష్ ని కూడా మాస్ హీరోగా మార్చేశాడు. మెగాస్టార్ కొడుకుని మెగా పవర్ స్టార్ గా ‘చిరుత’తో గ్రాండ్ లాంచ్ చేసాడు. రవితేజతో ‘నేనింతే’ అంటూ సినిమా కష్టాల్ని అందరికి కళ్ళకి కట్టినట్టు చూపించాడు..
Sarayu Roy: నేను వర్జిన్ కాదు.. ఏడేళ్ల సహజీవనం.. సరయు బోల్డ్ కామెంట్స్!
బాలీవుడ్ కి వెళ్లి గ్రేట్ అమితాబ్ తో కూడా ‘బుడ్డా హోగా తేరా బాప్’ అని హోరెత్తించాడు. వరుస ప్లాప్స్ లో ఉన్న ఎన్టీఆర్ తో ‘టెంపర్’ తీసి ఎన్టీఆర్ కి గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఛార్మిని హీరోయిన్ గా పెట్టి లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో ‘జ్యోతిలక్ష్మీ’ తీసాడు. బాలక్రిష్ణని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ తో చూపించి ‘పైసా వసూల్’ చేసాడు. ఆఖరికి చాకోలెట్ బాయ్ రామ్ ని కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ తో మాస్ హీరోగా మార్చేశాడు.
పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ , ఎన్టీఆర్ , బాలకృష్ణ , గోపీచంద్ , రామ్ చరణ్ ఇలా ఎందర్నో తన డైరెక్షన్ లో వాళ్ళ మ్యానరిజంని, వాళ్ళ క్యారెక్టరయిజేషన్ ని, వాళ్ళ లుక్స్ ని మార్చేసి కొత్తగా ప్రెసెంట్ చేసాడు పూరి. అందుకే ఆ హీరోల అభిమానులు అందరు పూరీని ఇష్టపడతారు. పోకిరి, రోగ్, ఇడియట్ అంటూ తిట్లని కూడా సినిమాలుగా తీసి వాటిని ముద్దు పేర్లుగా మార్చేశాడు. అందుకే పూరి జగన్ అంటే అందరికి ఇష్టం. ఎవడు కొడితే దిమ్మ తిరుగుద్దో వాడే పండుగాడు, సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చంటిగాడు లోకల్, నా పేరు శివమణి నాక్కొంచెం మెంటల్.. ఇలాంటి డైలాగ్స్ చిన్న పిల్లలు కూడా చెపుతున్నారంటే అది పూరి ప్రభావమే.
Bandla Ganesh : నన్ను గెలిపిస్తే కెసిఆర్ తో మాట్లాడి 100 ఇళ్ళు కట్టిస్తా.. బండ్లగణేష్
పూరి సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలు, ఆ సినిమాల్లోని డైలాగ్స్ జనాల్లోకి వెళ్లిపోతాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్ని కష్టాలు పడ్డా, లైఫ్ లో సెటిల్ అవ్వకముందే ప్రేమ పెళ్లి చేసుకొని కష్టాలు పడ్డా, కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు తాను నమ్మిన వాళ్లే తనని మోసం చేసినా, ఆస్తి అంతా పోయినా నిలదొక్కుకున్నాడు. ఎక్కడైతే పడిపోయాడో అక్కడే నిలదొక్కుకున్నాడు. అందుకే పూరి అంటే అందరికి ఇష్టం. సినిమాలతోనే కాక కరోనా టైంలో తన పాడ్ కాస్ట్ లతో ఎన్నో నిజాల్ని, జీవిత సత్యాల్ని ప్రజలకి తెలియచేసాడు అందుకే లవ్ యు జగన్ భాయ్.. హ్యాపీ బర్త్ డే టు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.