Queen Elizabeth II: విండ్సర్ కోట వద్ద గతంలో ఓ ఆత్మను చూసిన ఎలిజబెత్-II, ప్రిన్సెస్ మార్గరెట్‍!

 కొన్ని వారాల క్రితం మృతి చెందిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-IIతో పాటు ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్ కలిసి విండ్సర్ కోట వద్ద గతంలో ఓ ఆత్మను చూశారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఆత్మ మరెవరిదో కాదని ఎలిజబెత్-Iదేనని మిర్రర్ మీడియా తెలిపింది. బ్రిటిష్ రాయల్ కుటుంబానికి చెందిన విండ్సర్ కోట వద్ద దెయ్యాలు కనపడుతుంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

Queen Elizabeth II: విండ్సర్ కోట వద్ద గతంలో ఓ ఆత్మను చూసిన ఎలిజబెత్-II, ప్రిన్సెస్ మార్గరెట్‍!

Queen Elizabeth

Updated On : November 3, 2022 / 10:54 AM IST

Queen Elizabeth II: కొన్ని వారాల క్రితం మృతి చెందిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-IIతో పాటు ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్ కలిసి విండ్సర్ కోట వద్ద గతంలో ఓ ఆత్మను చూశారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఆత్మ మరెవరిదో కాదని ఎలిజబెత్-Iదేనని మిర్రర్ మీడియా తెలిపింది. బ్రిటిష్ రాయల్ కుటుంబానికి చెందిన విండ్సర్ కోట వద్ద దెయ్యాలు కనపడుతుంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

అక్కడి సైనికులకు ఆ దెయ్యాలు సెల్యూట్ చేస్తాయని, ఎముకలు చోరీ చేస్తుంటాయని కూడా మీడియాలో కథనాలు వస్తుంటాయి. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-IIకి విండ్సర్ కోట అంటే చాలా ఇష్టమని మిర్రర్ మీడియా పేర్కొంది. ఎలిజబెత్-I ఆత్మ కనపడే ముందు ఆమె అడుగుల చప్పుళ్లు వినపడతాయని తెలిపింది. ఓ ఆకారం కిటికీ నుంచి ఏదో కోరికతో చూస్తూ కనపడుతుందని ఒకరు తమకు చెప్పారని పేర్కొంది.

కింగ్ జార్జ్ III లాంటి ఆకారం లైబ్రరీ కింద ఉండే గదిలో కూర్చొని దేనికోసమో ఎదురుచూస్తూ కనపడతాడని తెలిపింది. విండ్సర్ కోట వద్ద మాత్రమే కాకుండా ఇతర పలు ప్రాంతాల్లోనూ దెయ్యాలు కనపడతాయని పేర్కొంది. కాగా, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-II 96 ఏళ్ల వయసులో తన స్కాటిష్ ఎస్టేట్ లో ఈ ఏడాది సెప్టెంబరులో మృతి చెందారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..