Raj Tharun: ఆడియెన్స్‌ను సీట్లలో కూర్చోబెట్టలేకపోయిన స్టాండప్ రాహుల్

యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం చాలా దారుణంగా తయారయిందని చెప్పాలి. అతడు చేస్తున్న ఏ ఒక్క సినిమా....

Raj Tharun: ఆడియెన్స్‌ను సీట్లలో కూర్చోబెట్టలేకపోయిన స్టాండప్ రాహుల్

Raj Tharun Failed Again With Stand Up Rahul Movie

Updated On : March 19, 2022 / 12:06 PM IST

Raj Tharun: యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం చాలా దారుణంగా తయారయిందని చెప్పాలి. అతడు చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతుంది. కెరీర్ తొలినాళ్లలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యమిచ్చిన ఈ యంగ్ హీరో వాటిని సూపర్ హిట్లుగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఒకే తరహా చిత్రాల ఎంపికతో తన కెరీర్‌ను తానే పతనంవైపు తీసుకెళ్లాడు.

Raj Tarun : ‘స్టాండ‌ప్ రాహుల్‌.. కూర్చుంది చాలు’..

ఇక ఇప్పుడు అతడు ఎలాంటి సినిమాను ఎంచుకుని చేసినా, అది ఆడియెన్స్‌కు కనెక్ట్ కావడంలో పూర్తిగా ఫెయిల్ అవుతూ వస్తోంది. తాజాగా స్టాండప్ రాహుల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. అయితే ఈ సినిమాలో కంటెంట్ ఆసక్తికరంగా లేకపోవడం, ఈ హీరో సినిమా అనగానే ఆడియెన్స్ కూడా లైట్ తీసుకోవడంతో స్టాండప్ రాహుల్ చిత్రాన్ని చూసేందుకు జనం థియేటర్లకు పెద్దగా రాలేదు.

దీంతో ఈ సినిమా తొలిరోజునే చాలా తక్కువ అక్యుపెన్సీని నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్‌లో మరే ఇతర సినిమాలు లేకపోవడంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను పెంచి ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేయగలిగితే కాస్త మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కానీ సినిమాలో ఆకట్టుకునే అంశం లేకపోవడం ఈ చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్‌గా మారింది.

Standup Rahul : వరుణ్‌తేజ్ చీఫ్ గెస్ట్‌గా రాజ్‌తరుణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఔట్‌డేటెడ్ నెరేషన్‌తో ఆడియెన్స్‌ను ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయిన రాజ్ తరుణ్ మరోసారి వెనకబడిపోయాడు. ఇలానే మరికొంత కాలం కొనసాగితే రాజ్ తరుణ్ కెరీర్ కష్టంలో పడే ఛాన్స్ ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఇకనైనా ఈ హీరో ఓ మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకుని ఎలాగైనా హిట్ కొడితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడనే వాస్తవాన్ని గ్రహిస్తాడా లేడా అనేది కాలమే చెబుతుంది.