నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో సూపర్‌స్టార్..

నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో సూపర్‌స్టార్..

Updated On : December 25, 2020 / 5:35 PM IST

Rajinikanth Health Condition: సూపర్‌స్టార్ రజనీ కాంత్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో శుక్రవారం ఆయణ్ణి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. రజినీ హైబీపీతో బాధపడుతున్నారని హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రజినీ అనారోగ్యానికి గురయ్యారనే వార్తతో చిత్ర పరిశ్రమ, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రజినీ ఆరోగ్యంపై ఆరా తీశారు. అలాగే చెన్నై నుంచి రజినీ వ్యక్తిగత వైద్యులు అపోలోకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రజినీను కలిసేందుకు పలువురు ప్రముఖులు ప్రయత్నాలు చేశారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండడంతో ఎవ్వరినీ రావొద్దని, చివరకు పెద్ద కుమార్తె ఐశ్వర్యను సైతం రూం వద్దకు రావొద్దని చెప్పారు.

ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఘాట్‌లోని ప్రత్యేక రూంలో రజినీకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇవాళ రాత్రి వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని, రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశముందని సమాచారం. కేవలం ఒక డాక్టర్ పర్యవేక్షణలో రజినీ సెల్ఫ్ ఇసోలేషన్‌లో ఉన్నారు.