Rakul Preet : నాకు తెలుగులో సినిమాలు లేవా..? అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్..
నాకు తెలుగులో సినిమా అవకాశాలు రావట్లేదని ఎప్పుడు చెప్పాను..? ఈ సంవత్సరం ఆరు సినిమాలు చేస్తున్నాను.. అవి కాకుండా కొత్త సినిమా ఆఫర్లూ వస్తున్నాయ్..

Rakul Preet
Rakul Preet: హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయినా తన గురించి తప్పుడు వార్తలు రాశారంటూ ఓ ఇంగ్లీష్ డైలీపై ఫైర్ అయ్యారామె. రకుల్‌కు తెలుగు సినిమాల్లో ఆఫర్స్ తగ్గిపోయాయంటూ రీసెంట్‌గా ఓ కథనం పబ్లిష్ అయింది. ఆ కథనంపై రకుల్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
‘నాకు తెలుగులో సినిమా అవకాశాలు రావట్లేదని ఎప్పుడు చెప్పాను..? ఈ సంవత్సరం ఆరు సినిమాలు చేస్తున్నాను. అవి కాకుండా కొత్త సినిమా ఆఫర్లూ వస్తున్నాయ్. ఆ విషయంలో నా డేట్స్ అడ్జెస్ట్ చెయ్యండి. లేదా మా టీంకి సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేశారు.
రకుల్ ట్వీట్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. ‘రకుల్, నువ్వు షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నావో నాకు తెలుసు.. ఈమధ్య నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్.. నీకు బాగా నచ్చింది. అయినా డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో ఆ సినిమా వాయిదా పడింది. ఇలాగే రాక్ చెయ్ రకుల్.. నీ సినిమాలతో అందరికీ ఆన్సర్ ఇవ్వు’ అంటూ హరీష్ శంకర్ రీ ట్వీటీ చేశారు.
I wonder when I said this ???Friends there are only 365 days in a year and if you can help in adjusting more than 6 films that iam doing right now then plz help my team. ? ???#anythingforheadlines https://t.co/ACVaTHO4XO
— Rakul Singh (@Rakulpreet) June 20, 2021