Ram Charan: జవాన్ల త్యాగాన్ని మరవద్దు – చరణ్
భారత ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో...

Ram Charan At Azadi Ka Amrit Mahotsav Event
Ram Charan: భారత ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. డిఫెన్స్ అధికారులు నిర్వహించిన యుద్ధవీరుల నివాళుల కార్యక్రమంలో ఆయన పాల్గొని వీరులకు నివాళులు అర్పించారు.
Ram Charan : స్పెషల్ ఫుడ్ వండించి, టైం కేటాయించి.. పంజాబ్‌లో సోల్జర్స్‌తో చరణ్..
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నాడు. భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను జరుపుకోవడం.. దేశాన్ని భద్రంగా కాపాడుతున్న జవాన్ల వీర త్యాగాన్ని గౌరవించుకోవడం మన అందరి అదృష్టమని.. మన జీవితాలను ప్రశాంతంగా గుడుపుతున్నామంటే.. అది కేవలం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాల వల్లే అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
Ram Charan : పంజాబ్ లో RC15 షూట్.. RRR ఎఫెక్ట్.. చరణ్‌తో ఫోటోల కోసం పంజాబ్ పోలీసుల క్యూ..
సైనికుల ధైర్యసాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని.. మనం నడిచే నేల, పీల్చే గాలి, బతుకుతున్న దేశంపై వీరజవాన్ల చెరగని సంతకం ఎప్పటికీ ఉంటుందని.. అలాంటి వీరుల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోవద్దని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక దేశం ప్రశాంతంగా ఉండాలంటే అది కేవలం మన సైనికుల చేతిలోనే ఉంటుందని.. అలాంటి ఆర్మీ జవాన్ పాత్రలో ‘ధృవ’ సినిమాలో నటించే అవకాశం రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని చరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్మీ ఆఫీసర్స్‌తో పాటు స్కూల్ విద్యార్ధులు కూడా పాల్గొన్నారు.