Rangasthalam : చిట్టిబాబు చెన్నై వెళ్తున్నాడు.. తమిళనాట థియేటర్లలో ‘రంగస్థలం’..

‘రంగస్థలం’.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత అక్కినేని, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌ కెరీర్‌లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది..

Rangasthalam : చిట్టిబాబు చెన్నై వెళ్తున్నాడు.. తమిళనాట థియేటర్లలో ‘రంగస్థలం’..

Rangasthalam Tamil

Updated On : April 20, 2021 / 3:39 PM IST

Rangasthalam: ‘రంగస్థలం’.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత అక్కినేని, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌ కెరీర్‌లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది..

Rangasthalam

తన సినిమాలతో ప్రేక్షకుడి మెదడుకి పదునుపెడుతూ, ఆడియెన్స్ ఆలోచనా విధానాన్ని మార్చే సుకుమార్.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చెయ్యబోతోంది..

Rangasthalam

ఏప్రిల్ 30న ‘రంగస్థలం’ తమిళ్ డబ్బింగ్ వెర్షన్ తమిళనాడులో సెలెక్టెడ్ థియేటర్లలో విడుదల కానుంది. తమిళ నేటివిటీని తలపించే క్లైమాక్స్‌తో సహా కాన్సెప్ట్, క్యారెక్టర్స్, కథలో ఎమోషన్ తమిళ ప్రేక్షకులకు నచ్చుతాయంటున్నారు సినీ వర్గాలవారు.. 7 జి ఫిల్మ్స్ సంస్థ ‘రంగస్థలం’ చిత్రాన్ని విడుదల చేస్తోంది..

Rangasthalam

Rangasthalam