సంక్రాంతి తర్వాత సమ్మర్‌కి ‘మాస్ మహారాజా’

సంక్రాంతి తర్వాత సమ్మర్‌కి ‘మాస్ మహారాజా’

Updated On : January 30, 2021 / 5:05 PM IST

Khiladi: సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ సమ్మర్‌లో మరో సినిమా రిలీజ్‌కి రెడీ అయిపోయాడు. ‘వీర’ తర్వాత రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’.. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాఢి’ లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు కాగా.. సీనియర్ నటుడు ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Khiladi

రవితేజ పుట్టినరోజు(జనవరి 26) సందర్భంగా ‘ఖిలాఢి’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వేసవి కానుకగా మే 28న ‘ఖిలాడి’ థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.