Telangana: గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నా: ఈట‌ల

గజ్వేల్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించటమే త‌న లక్ష్యమ‌ని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలని ఆయ‌న‌ సవాల్ విసిరారు.

Telangana: గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నా: ఈట‌ల

Etela

Updated On : July 11, 2022 / 2:14 PM IST

Telangana: గజ్వేల్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించటమే త‌న లక్ష్యమ‌ని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలని ఆయ‌న‌ సవాల్ విసిరారు. ఎన్నికల సంఘం తన పని తాను చేస్తుంద‌ని తెలిపారు. భూముల విషయంలో తప్పుచేస్తే ముక్కు నేలకు రాస్తామన్న త‌న భార్య మాటకు కట్టుబడి ఉన్నామ‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ మాదిరి వ్యవహరించిన‌ శ్రీలంక అధ్యక్షుడికి ఎలాంటి గతి పట్టిందో చూశామ‌ని విమ‌ర్శించారు. మతిభ్రమించి కేసీఆర్ గంటల కొద్దీ మీడియా స‌మావేశాలు నిర్వహిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

AIADMK Controversy : అన్నాడీఎంకే వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పు..కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్

త‌న‌ను తక్కువగా అంచనా వేయొద్దని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి మాదిరిగా డబ్బుతో త‌న‌ను కూడా ఓడిస్తానని‌ కేసీఆర్ కలలు కన్నార‌ని ఈట‌ల చెప్పారు. రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి‌న దళిత ద్రోహి కేసీఆర్ అని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రధాని మోదీపై భట్టి విమర్శలు చేస్తే.. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఖండించిన మాట వాస్తవమేన‌ని అన్నారు. త‌న‌ తల్లి త‌నకు సంస్కారం నేర్పింద‌ని, తెలంగాణ సమాజం సహనాన్ని, హుజురాబాద్ ప్రజలు ధైర్యాన్ని ఇచ్చారని ఆయ‌న చెప్పారు.

Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

కేసీఆర్ చెప్పే మాటలకు‌, చేసే పనులకు పొంతన లేదని చెప్పినందుకే త‌నపై కక్ష గట్టారని అన్నారు. త‌న‌ లాంటి వారు కేసీఆర్ నచ్చర‌ని, ఆయనకు కావాల్సింది బానిసలు అని ఆయ‌న చెప్పారు. అసెంబ్లీలో త‌న‌ ముఖం కనప‌డ‌కుండా ఉండేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేశారని ఆయ‌న అన్నారు. 50 శాతమున్న బీసీలకు మూడు మంత్రి పదవులా? గిరిజనులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు? అని ఆయ‌న నిల‌దీశారు. త‌న‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, తన్ని తరిమికొడతామ‌ని హెచ్చ‌రించారు. సీఎం కేసీఆర్ కుసంస్కారంతో మాట్లాడుతున్నార‌ని ఈటల రాజేందర్ అన్నారు.