ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’

  • Published By: sekhar ,Published On : December 2, 2020 / 03:30 PM IST
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’

Updated On : December 4, 2020 / 6:11 PM IST

Rebel Star Prabhas – SALAAR: టాలీవుడ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా మ‌రో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. సెన్సేషనల్ హిట్ ‘కె.జి.య‌ఫ్’ మూవీ నిర్మాత విజ‌య్ కిరగందూర్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో ప్ర‌భాస్ చేస్తున్న సినిమా‌కు ‘స‌లార్‌’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. ‘సలార్’ అంటే.. లీడర్, నాయకుడు అని అర్థం.


టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ప్ర‌భాస్ మెషిన్ గ‌న్ ప‌ట్టుకుని కూర్చుని ఉన్న లుక్ ఆక‌ట్టుకుంటోంది. ‘The most violent men… Called him… The most violent’ అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు.

Prabhas

‘సలార్’ షూటింగ్‌ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంది. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.