‘ఆదిపురుష్’ కి కొబ్బరికాయ కొట్టేది ఎప్పుడంటే..

‘ఆదిపురుష్’ కి కొబ్బరికాయ కొట్టేది ఎప్పుడంటే..

Updated On : January 19, 2021 / 11:45 AM IST

Adipurush: రెబల్‌ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ విషయంలో టీమ్ మామూలు స్పీడుగా లేదు. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి వరుస అప్‌డేట్స్‌తో అదరగొడుతున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.
మంగళవారం ‘ఆదిపురుష్’ కి సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం..

Adipurush

ఈ సినిమా మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌ను ఈరోజు (జనవరి 19) నుండి చిత్ర యూనిట్‌ ప్రారంభించింది. ఈ టెక్నాలజీని హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. హై స్టాండర్డ్ టెక్నాలజీతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ ని ఫిబ్రవరి 2న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు. డార్లింగ్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ పూర్తి కావొచ్చింది.. మరో పాన్ ఇండియా మూవీ ‘సలార్’ ఇటీవలే ప్రారంభమైంది.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)