Virgin Galactic: కాంటెస్ట్‌లో విన్ అయితే ఫ్రీగా అంతరిక్షం ప్రయాణం!

కాలం మారింది.. దేశాలు, ఖండాలు దాటి ప్రయాణం చేయడమే కాదు.. ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రయాణం చేసేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇతర గ్రహాల మీద కూడా స్థలాల కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. అదంతా ఆషామాషీ కాదు. అంతరిక్ష ప్రయాణమంటే అదేమీ చిన్న విషయం కాదు. స్పేస్ ట్రావెల్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాగా..

Virgin Galactic: కాంటెస్ట్‌లో విన్ అయితే ఫ్రీగా అంతరిక్షం ప్రయాణం!

Virgin Galactic

Updated On : July 15, 2021 / 4:35 PM IST

Virgin Galactic: కాలం మారింది.. దేశాలు, ఖండాలు దాటి ప్రయాణం చేయడమే కాదు.. ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రయాణం చేసేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇతర గ్రహాల మీద కూడా స్థలాల కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. అదంతా ఆషామాషీ కాదు. అంతరిక్ష ప్రయాణమంటే అదేమీ చిన్న విషయం కాదు. స్పేస్ ట్రావెల్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాగా.. పరిశోధకులు కాకుండా ఇతర వారు వెళ్లేందుకు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అయితే, వ‌ర్జిన్ గెలాక్టిక్‌లంటి కంపెనీలు ఇప్పుడు సాధార‌ణ పౌరుల‌ను కూడా స్పేస్‌లోకి తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ మ‌ధ్యే ఆ సంస్థ చీఫ్ రిచర్డ్ బ్రాన్స‌న్‌తోపాటు మ‌న తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా అంత‌రిక్షంలోకి వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇలా స్పేస్ లోకి వెళ్లి వచ్చేందుకు వ‌ర్జిన్ గెలాక్టికే ఒక్కో టికెట్‌కు రెండున్న‌ర ల‌క్షల డాల‌ర్లు వసూలు చేస్తోంది. దీనిని బట్టిచూస్తే ఇది సామాన్య ప్రజలకు ఊహకుకూడా అందని వ్యవహారమే అనుకోవాలి. అయితే.. సామాన్యులను కూడా ఫ్రీగా స్పేస్ లోకి తీసుకెళ్లేందుకు వ‌ర్జిన్ గెలాక్టిక్‌ ప్రయత్నిస్తుంది.

ఒమేజ్ అనే ఓ చారిటీ సంస్థ‌తో క‌లిసి ఇద్ద‌రిని ఉచితంగా పంపాల‌ని నిర్ణ‌యించిన వర్జిన్ గెలాక్టిక్ దీనికోసం ఓ కాంటెస్ట్ నిర్వ‌హిస్తున్నారు. Omaze.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎవ‌రైనా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పించగా ఇందులో స‌పోర్ట్ స్పేస్ ఫ‌ర్ హ్యుమానిటీ అండ్ ఎంట‌ర్ ఫ‌ర్ యువ‌ర్ చాన్స్ టు విన్ అనే పేజ్ లోకి వెళ్లి మీకు న‌చ్చినంత విరాళంగా ఇచ్చి మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ విరాళం ఇవ్వ‌క‌పోయినా మీ వివ‌రాల‌న్నింటినీ న‌మోదు చేసి స‌బ్‌మిట్ చేసుకోవచ్చు.

ఈ నెల 11నే దీనికోసం ఎంట్రీలు ప్రారంభ‌మ‌వగా సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కూ ఇవి కొన‌సాగుతాయి. విజేత‌ను సెప్టెంబ‌ర్ 29న ప్రకటించి 2022 మొద‌ట్లో విజేత‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లే అవ‌కాశం ఉంటుంది. విజేత‌కు వ‌ర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌షిప్‌టూలో రెండు సీట్లు కేటాయించనుండగా విజేత‌తోపాటు వారి వెంట మరొకరికి అవ‌కాశం క‌ల్పిస్తారు. వీరికి స‌బ్ ఆర్బిట‌ల్ ఫ్లైట్ శిక్ష‌ణ ఇచ్చిన అనంతరం అంతరిక్ష ప్రయాణానికి తీసుకెళ్లనున్నారు.