Roja : కూతురి సినీ ఎంట్రీపై రోజా వ్యాఖ్యలు..

రోజా మాట్లాడుతూ.. ''నేను యాక్టింగ్ వద్దు అనను. నా కూతురు, నా కొడుకు ఎవరైనా ఆసక్తితో సినిమాల్లోకి వస్తానంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను. కానీ నా కూతురికి.............

Roja : కూతురి సినీ ఎంట్రీపై రోజా వ్యాఖ్యలు..

Roja comments on her daughter anshu malika industry entry

Updated On : November 19, 2022 / 8:09 AM IST

Roja :  రోజా కూతురిగా అన్షు మాలిక అందరికి పరిచయమే. కానీ రోజా కూతురి కంటే కూడా ఒక రచయితగా అన్షు మరింత ఫేమస్ అయింది. ఇప్పటికి అన్షు పలు పుస్తకాలని రచించి, అవార్డులు, రివార్డులు కూడా అందుకుంటుంది. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలని రాయబోతుంది. అయితే గత కొంతకాలంగా అన్షు సినిమాల్లోకి రానుంది అని వార్తలు వస్తున్నాయి.

తాజాగా రోజా సెల్వమణి తన కూతురు సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై మాట్లాడుతూ ఈ వార్తలకి క్లారిటీ ఇచ్చింది. రోజా తన పుట్టినరోజు నాడు తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడారు.

Sunaina : లవ్ బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు.. అప్పుడే పెళ్లేంటి అంటున్న హీరోయిన్..

రోజా మాట్లాడుతూ.. ”నేను యాక్టింగ్ వద్దు అనను. నా కూతురు, నా కొడుకు ఎవరైనా ఆసక్తితో సినిమాల్లోకి వస్తానంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకొని సైంటిస్ట్ అవ్వాలని కోరిక. ప్రస్తుతం తను చదువు మీదే ఫోకస్ చేస్తుంది. ఇప్పట్లో అయితే సినిమాల వైపు రాదు. ఒకవేళ వస్తానంటే ఒక తల్లిగా ఆశీర్వదిస్తాను. ఒక హీరోయిన్ గా సపోర్ట్ గా నిలబడతాను” అని తెలిపింది. మరి అన్షు ఎప్పటికైనా వెండితెరపై కనిపిస్తుందేమో చూడాలి.