Sunaina : లవ్ బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు.. అప్పుడే పెళ్లేంటి అంటున్న హీరోయిన్..
తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునైనా తెలుగు, మలయాళం, కన్నడలో కూడా పలు సినిమాలు చేసింది. హీరోయిన్ తో పాటు ఇంపార్టెన్స్ ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా................

Sunaina shares about her recent love breakup
Sunaina : తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునైనా తెలుగు, మలయాళం, కన్నడలో కూడా పలు సినిమాలు చేసింది. హీరోయిన్ తో పాటు ఇంపార్టెన్స్ ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా చేస్తుంది. తెలుగులో ఇటీవల శ్రీవిష్ణు సరసన రాజా రాజా చోర సినిమాలో నటించింది. అలాగే చదరంగం వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది. త్వరలో మీట్ క్యూట్, లాఠీ, రెజీనా సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది.
తాజాగా తన ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు తెలిపింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగగా.. ”ఇటీవల జరిగిన హార్ట్ బ్రేక్ నుంచి ఇంకా రికవర్ అవ్వలేదు, ముందు అది రికవర్ అవ్వనివ్వండి” అని తెలిపింది. దీంతో ఈ భామ ఇటీవలే లవ్ ఫెయిల్యూర్ అయినట్టు తెలుస్తుంది. 33 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో చాలా మంది పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు సునైనాని.
Let me recover from the last heartbreak ? https://t.co/s8GC81iLpO
— SUNAINAA (@TheSunainaa) November 16, 2022