Russo-Ukrainian War: రష్యా క్షిపణి దాడులు.. 23 మంది మృతి.. 100 మందికి గాయాలు
ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలో తాజాగా రష్యా క్షిపణి దాడి చేసి 23 మంది పౌరుల ప్రాణాలు తీసింది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు.రష్యా దాడిలో 100 మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలకు గాయాలయ్యాయి.

Ukraine Russia War Russian Forces Launched 26 Attacks On Towns And Villages In Luhansk Region (1)
Russo-Ukrainian War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలో తాజాగా రష్యా క్షిపణి దాడి చేసి 23 మంది పౌరుల ప్రాణాలు తీసింది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు.రష్యా దాడిలో 100 మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలకు గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 34 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 39 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు వివరించారు. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.
Lancet study: మద్యం వల్ల 15 నుంచి 39 ఏళ్ళ మధ్య వయసు వారికి తీవ్ర ముప్పు
ప్రతిరోజు ఇటువంటి దాడులు కొనసాగుతున్నాయని ఆయన టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. మిలటరీని కాకుండా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఇది ఉగ్రవాద చర్యేనని అన్నారు. రష్యా క్షిపణి అపార్ట్‌మెంట్లపై పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా ప్రయోగించిన రెండు క్షిపణులను తాము కూల్చివేశామని చెప్పారు. మరో రెండు క్షిపణులు విన్నిట్సియాలోని అపార్ట్‌మెంట్లను ఢీ కొట్టాయి. ఈ దాడుల గురించి రష్యా అధికారలు అధికారంగా ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. జనావాసాలపై రష్యా చేసిన తాజా దాడిని ఈయూ ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.