‘ఆహా’ క్రిస్మస్ స్పెషల్.. మెగా ఎపిసోడ్ ప్రీమియర్స్ ఎప్పుడంటే..

  • Published By: sekhar ,Published On : December 13, 2020 / 03:14 PM IST
‘ఆహా’ క్రిస్మస్ స్పెషల్.. మెగా ఎపిసోడ్ ప్రీమియర్స్ ఎప్పుడంటే..

Updated On : December 13, 2020 / 3:23 PM IST

Sam Jam Mega Episode: ఫస్ట్ అండ్ పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమంతతో ఇటీవల ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సామ్ తనదైన స్టైల్లో పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ‘ఆహా’ తమ ప్రేక్షకులకోసం పర్ఫెక్ట్ క్రిస్మస్ ట్రీట్ రెడీ చేసింది.

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతున్న ‘సామ్ జామ్’ షూటింగ్‌లో పాల్గొన్నారు. అప్పుడు కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.. చిరు స్టైలిష్ లుక్‌లో అదిరిపోయారు.

Megastar Chiranjeevi

క్రీమ్ కలర్ ప్యాంటు, వైట్ టీ షర్ట్, గ్రే కలర్ బ్లేజర్, గాగుల్స్‌తో చిరు నడుచుకుంటూ వస్తున్న పిక్స్ కిరాక్ ఉన్నాయి. క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న మెగాస్టార్ పార్టిసిపెట్ చేసిన ఈ మెగా ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ షో లో చిరు సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే 25 వరకు ఆగాల్సిందే.

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi