Samantha : తెలుగు రాష్ట్రాల్లో సమంతకి భారీ కటౌట్స్.. థియేటర్స్ వద్ద సమంత ఫ్యాన్స్ రచ్చ..
ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో సమంత అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సినిమా కోసం థియేటర్స్ కి వస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో యశోద సినిమా నడిచే థియేటర్స్ వద్ద సమంతకి..............

Samantha huge cutots at some theaters in telugu states
Samantha : చాలా గ్యాప్ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది. ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానుంది. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నేడు నవంబర్ 11న విడుదల కానుంది.
దీంతో థియేటర్స్ వద్ద సమంత ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో సమంత అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సినిమా కోసం థియేటర్స్ కి వస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో యశోద సినిమా నడిచే థియేటర్స్ వద్ద సమంతకి భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. దాదాపు చాలా థియేటర్స్ వద్ద సమంతకి భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ఈ కటౌట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Bollywood : బాలీవుడ్‌కి నో చెప్తున్న హీరోలు..
స్టార్ హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా సమంతకి వస్తున్న క్రేజ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక హీరోయిన్ కి ఇన్ని చోట్ల కటౌట్స్ పెట్టడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. సమంత ఫ్యాన్స్ ఈ కటౌట్స్ ఏర్పాటు చేసి థియేటర్స్ వద్ద రచ్చ చేస్తున్నారు. మరి చాలా గ్యాప్ తర్వాత సమంత మెయిన్ లీడ్ లో వస్తున్న సినిమా యశోదకి ఎలాంటి ఫలితం రానుందో చూడాలి.
Experience the Rush⚡️peeking into the World of #Yashoda ?
Don't miss it in theatres near you
?️ https://t.co/03UPbyReCC#YashodaFromTomorrow ? pic.twitter.com/Y5TtbCrmJ3— vennela kishore (@vennelakishore) November 10, 2022