Samantha: ‘యశోద’ స్పీడుకు టెన్షన్ పడుతున్న ‘శాకుంతలం’..?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ ‘యశోద’ రేపు ప్రపంచవ్యప్తంగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు చాలా ఆతృతగా చూస్తున్నారు. చాలా రోజుల తరువాత సామ్ మూవీ తెలుగులో నేరుగా వస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Samantha Yashoda Movie Creating Tension In Shakuntalam Team
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ ‘యశోద’ రేపు ప్రపంచవ్యప్తంగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు చాలా ఆతృతగా చూస్తున్నారు. చాలా రోజుల తరువాత సామ్ మూవీ తెలుగులో నేరుగా వస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Samantha : యశోద ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇన్ని కోట్లా.. మరి సమంత అంత రాబడుతుందా??
ఈ సినిమాలో సామ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను సరికొత్త కథాంశంతో దర్శకుడు హరి-హరిశ్‌లు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కోసం సమంత తన ఆరోగ్యం బాగాలేకపోయినా, ప్రమోషన్స్‌లో పాల్గొంది. దీంతో ప్రేక్షకులు, అభిమానులు ఆమె కమిట్‌మెంట్, ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు యశోద సినిమా ప్రమోషన్స్ మరో సినిమా యూనిట్‌ను టెన్షన్ పెడుతున్నాయి.
Samantha: యశోద సినిమా ఓకే చేసేందుకు సమంతకు ఎంత సమయం పట్టిందో తెలుసా?
సమంత నటిస్తున్న మరో మూవీ ‘శాకుంతలం’ కూడా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని, ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 3Dలోనూ రూపొందిస్తుండటంతో, గ్రాఫిక్స్ వర్క్ కోసం మరింత సమయం పడుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో సమంత అనారోగ్యం నుంచి కోలుకోకపోతే, సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనదేమో అనే టెన్షన్ ఇప్పుడు వారిని భయపెడుతోంది. మరి శాకుంతలం చిత్ర యూనిట్ టెన్షన్ పడుతున్నట్లుగా సామ్ నిజంగానే ఆ సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుందా లేక ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేస్తుందా అనేది చూడాలి.