Idgah Maidan: ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలపై సుప్రీం అత్యవసర విచారణ

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో వారికి చుక్కెదురైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్ధించింది. ఉత్సవ నిర్వహణపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంతో బెంగళూరులోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది

Idgah Maidan: ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలపై సుప్రీం అత్యవసర విచారణ

SC hearing plea on ganesh festival at bangaluru idgah maidan

Updated On : August 30, 2022 / 7:17 PM IST

Idgah Maidan: బెంగళూరులోని ఈద్గా మైదానంలో గణేషుడి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ విషయమై ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం అత్యవసర విచారణ చేపట్టింది. రేపు ఉదయమే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఈ విషయమై ఈరోజే తుది తీర్పు ఇవ్వాలని కోర్టు భావిస్తున్నట్లు సమాచారం.

ఈద్గా మైదానంలో వినాయకుడి విగ్రహాలు పెట్టడానికి తొలుత ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో వారికి చుక్కెదురైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్ధించింది. ఉత్సవ నిర్వహణపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంతో బెంగళూరులోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించడంతో వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్ పై ధర్మాసనం స్పందిస్తూ, గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఈ మైదానంలో జరిగాయా? అని ప్రశ్నించింది. బృహత్ బెంగళూరు మహా నగర పాలికే తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి మాట్లాడుతూ, ఇప్పటి కార్యక్రమాన్ని వ్యతిరేకించడానికి అది ప్రాతిపదిక కాబోదన్నారు. 200 ఏళ్ళ నుంచి ఈ మైదానాన్ని బాలల ఆటస్థలంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. రెవిన్యూ రికార్డుల్లో ప్రభుత్వం పేరు ఉందని తెలిపారు.

Operation Kamala: జార్ఖండ్‭పై గురి పెట్టిన బీజేపీ.. పరుగు పరుగున ఎమ్మెల్యేలను తరలిస్తున్న జేఎంఎం-కాంగ్రెస్