Heavy Rainfall in Tamil Nadu: పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. తమిళనాడులో స్కూళ్లకు సెలవులు

దేశంలోని తమిళనాడు, ఢిల్లీ,అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు....

Heavy Rainfall in Tamil Nadu: పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. తమిళనాడులో స్కూళ్లకు సెలవులు

పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy Rainfall Various States: దేశంలోని తమిళనాడు, ఢిల్లీ, అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బిపర్ జోయ్ తుపాన్ ప్రభావం వల్ల గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలోని సోమవారం ఉదయం వర్షం కురిసింది. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యలో ఐఎండీ అధికారులు సోమవారం అలర్ట్ ప్రకటించారు.

Cyclone Biparjoy Brings Heavy Rain: రాజస్థాన్‌లో వెల్లువెత్తిన వరదలు, నలుగురి మృతి

తమిళనాడు రాష్ట్రంలో సోమవారం కురుస్తున్న భారీవర్షాలతో(Heavy Rainfall warning) పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.(Schools shut in various districts) తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట్, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్ పేట, వెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో ఆయా జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. చెన్నై, తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో మూడు గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.చెన్నై నగరంలో ఆదివారం రాత్రి భారీవర్షం కురిసింది.

Punjab Police nab Daaku Haseena: రూ.10ల డ్రింక్ సాయంతో డాకు హసీనాను పట్టుకున్న పోలీసులు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. అసోంలోని లఖింపూర్ లో వరదలు వెల్లువెత్తాయి.అసోంలో కురుస్తున్న భారీవర్షాలతో అన్నీ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి.

Heavy Rains : భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. విరిగిపడిన కొండచరియలు, వాహనాల రాకపోకలకు అంతరాయం

వరదల్లో సహాయ పునరావాస పనులు చేపట్టేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.బిపర్ జోయ్ తుపాన్ ప్రభావం వల్ల రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చే 12 గంటల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. బార్మేర్ జిల్లాలో వరదనీరు జననివాస ప్రాంతాలను ముంచెత్తింది. తుపాన్ వల్ల గుజరాత్ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నాయి.