Heavy Rains : భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. విరిగిపడిన కొండచరియలు, వాహనాల రాకపోకలకు అంతరాయం

కొండ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి చాలా మంది చిక్కుకుపోయారు.

Heavy Rains : భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. విరిగిపడిన కొండచరియలు, వాహనాల రాకపోకలకు అంతరాయం

Sikkim Rains

Sikkim Heavy Rains : సిక్కిం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు మూసుకుపోయాయి. స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిక్కిం ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా అవసరమైన చోట హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వర్షాలతో అల్లకల్లోలమైన సిక్కింలో అధికారులు భారీగా సహాయక చర్యలు చేపట్టారు.

రెండో రోజు కొనసాగిన సహాయక చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి భోజన, వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Huge Earthquake : మెక్సికోలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు

కొండ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి చాలా మంది చిక్కుకుపోయారు. రహదారి మధ్యలో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.