Secunderabad protests: సికింద్రాబాద్ అల్లర్లు.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సుబ్బారావు
సుబ్బారావు తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నాంపల్లి కోర్టు నుంచి సికింద్రాబాద్ కోర్టుకు బదిలీ చేస్తారు. అక్కడ మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. కాగా, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారావు అంటున్నారు.

Secunderabad Protests
Secunderabad protests: ఇటీవల జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సుబ్బారావు తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నాంపల్లి కోర్టు నుంచి సికింద్రాబాద్ కోర్టుకు బదిలీ చేస్తారు.
Jubilee Hills Rape Case: నిందితుల డీఎన్ఏ సేకరణకు పోలీసుల ఏర్పాట్లు
అక్కడ మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. కాగా, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారావు అంటున్నారు. భారత దేశం కోసం ఆర్మీలో సేవచేసిన తాను ఎందుకు అలాంటి దాడులకు పాల్పడతానని సుబ్బారావు పిటిషన్‌లో పేర్కొన్నారు. కాలికి బుల్లెట్ గాయం అయిందని, అయినప్పటికీ దేశం కోసం యువతను ఆర్మీలో చేర్చాలని, వారికి సుబ్బారావు కోచింగ్ ఇస్తున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు తమ పిటిషన్‌లో వివరించారు. పోలీసులు కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని సుబ్బారావు అంటున్నాడు. సుబ్బారావు నర్సరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో ఆర్మీ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్నారు.
Covid Cases: 17 వేలు దాటిన డైలీ కోవిడ్ కేసులు
‘అగ్నిపథ్’ స్కీం నేపథ్యంలో ఆర్మీ పరీక్ష రద్దు కావడం వల్ల అభ్యర్థులను సుబ్బారావు రెచ్చగొట్టినట్లు, ఆయన ఆధ్వర్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొన్ని ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని పోలీసుల అంచనా.