Covid Cases: 17 వేలు దాటిన డైలీ కోవిడ్ కేసులు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,073 కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. ఒక్క రోజులోనే 45 శాతం కేసులు పెరగడం గమనార్హం. గతవారం రోజుల్లోనే లక్ష కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

Covid Cases: 17 వేలు దాటిన డైలీ కోవిడ్ కేసులు

Covid Cases

Updated On : June 27, 2022 / 11:07 AM IST

Covid Cases: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,073 కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. ఒక్క రోజులోనే 45 శాతం కేసులు పెరగడం గమనార్హం. గతవారం రోజుల్లోనే లక్ష కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల్లో కరోనాతో వంద మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 94,420 కాగా, పాజిటివ్ కేసుల శాతం 0.22గా ఉంది. దేశంలో ఇప్పటివరకు 4,34,07,046 మందికి కరోనా సోకగా, వీరిలో 5,25,020 మంది మరణించారు. దేశంలో రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Jubilee Hills Rape Case: నిందితుల డీఎన్ఏ సేకరణకు పోలీసుల ఏర్పాట్లు

ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,87,606. ఒక్క రోజులో మహారాష్ట్రలో అత్యధికంగా 6,493 కరోనా కేసులు, ఆ తర్వాత ఢిల్లీలో 1,891 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 197.11 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చారు. నిన్న ఒక్క రోజులోనే 2,49,646 డోసుల వ్యాక్సిన్ పూర్తైంది. వీటిలో 193 కోట్ల వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా పంపిణీ చేసింది. ఇంకా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దగ్గర 12 కోట్ల డోసులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.