Singapore: గొటబాయ రాజపక్సకు మేము ఆశ్రయం ఇవ్వలేదు: సింగపూర్ ప్రభుత్వం
ప్రైవేటు పర్యటన నిమిత్తం శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తమ దేశానికి వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తనకు శ్రీలంకలో ఆశ్రయం ఇవ్వాలని ఆయన కోరలేదని, అలాగే తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది.

Gotabaya Rajapaksa
Singapore: ప్రైవేటు పర్యటన నిమిత్తం శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తమ దేశానికి వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తనకు శ్రీలంకలో ఆశ్రయం ఇవ్వాలని ఆయన కోరలేదని, అలాగే తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది. మొదట శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయిన గొటబాయ రాజపక్స అక్కడి నుంచి నేడు సింగపూర్‌కు చేరుకున్నారు. సింగపూర్ ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ విదేశాంగ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది.
Asia Cup In Sri Lanka: ఈ సమయంలో ఏమీ చెప్పలేం: గంగూలీ
కాగా, మాల్దీవుల నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం-ఎస్వీ 788లో రాజపక్స సింగపూర్ చాంగీ విమానాశ్రయం చేరుకున్నారు. గొటబాయ రాజపక్స సింగపూర్‌కు పారిపోయినప్పటికీ శ్రీలంకలో ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. గొటబాయ రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయకుండా విదేశాలకు పారిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.