Sri Lanka: గొటబాయ రాజపక్స రాజీనామాను ఆమోదించాను.. 7 రోజుల్లో శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు: అభయ్‌వర్ధన
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను ఆమోదిస్తున్నానని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహింద అభయ్‌వర్ధన ఇవాళ ప్రకటించారు. నిన్న మాల్దీవుల నుంచి సింగపూర్‌కు చేరుకున్న గొటబాయ రాజపక్స అక్కడి నుంచి ఈ-మెయిల్లో రాజీనామా లేఖను మహింద అభయ్‌వర్ధనకు పంపిన విషయం తెలిసిందే.

Speaker
Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను ఆమోదిస్తున్నానని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహింద అభయ్‌వర్ధన ఇవాళ ప్రకటించారు. నిన్న మాల్దీవుల నుంచి సింగపూర్‌కు చేరుకున్న గొటబాయ రాజపక్స అక్కడి నుంచి ఈ-మెయిల్లో రాజీనామా లేఖను మహింద అభయ్‌వర్ధనకు పంపిన విషయం తెలిసిందే. ఈ-మెయిల్ ద్వారా పంపిన రాజీనామాకు సంబంధించి చట్టబద్ధతను స్పీకర్ కార్యాలయం పరిశీలించింది. దీంతో దీనిపై నేడు స్పీకర్ మహింద అభయ్‌వర్ధన తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Lancet study: మద్యం వల్ల 15 నుంచి 39 ఏళ్ళ మధ్య వయసు వారికి తీవ్ర ముప్పు
కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చట్టబద్ధ ప్రక్రియను మొదలుపెడతామని అన్నారు. ఇందుకోసం పార్లమెంటు సభ్యులతో రేపు సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీలంకలో వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పారు. శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేయడంతో ఆ దేశంలో నిరసనలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ఉన్నారు. ఆందోళనలు చెలరేగకుండా శ్రీలంక సైన్యం చర్యలు తీసుకుంటోంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఇంధనం, ఆహారం, ఇతర నిత్యావసరాలు తగినంత లభ్యం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.