BJP counter to Rahul: ప్రజలు తిరస్కరిస్తే ప్రజాస్వామ్యాన్ని నిందిస్తారేం?
మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న్యాయవ్యవస్థను కూడా పని చేయకుండా జడ్జిలను జైళ్లలో వేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇది వారికి జీర్ణం కావడం లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని నిందిస్తున్నారు

Stop Blaming Indian Democracy For People Rejection BJP Counter Attack Congress
BJP counter to Rahul: కళ్ళెదుట ప్రజాస్వామ్యం చచ్చిపోతుండటాన్ని భారత దేశం చూస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, దీన్ని జీర్ణం చేసుకోలేక ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని నిందిస్తున్నారని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన రాహుల్ గాంధీ మరీ ఇంత బాధ్యతారాహిత్యంగా సిగ్గుచేటుగా మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిజానికి రాహుల్ నాయనమ్మ అయిన ఇందిరా గాంధీ తన హయాంలో ప్రజాస్వామ్యాన్నే రద్దు చేశారని, ఆ విషయాన్ని ఆయన గుర్తించలేకపోతోందని ప్రసాద్ మండిపడ్డారు.
దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు వీరు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీతో పాటు శశి థరూర్, ఇతర నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని ధరల పెరుగుదల, నిరుద్యోగం సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తాము భావించామని చెప్పారు. సమాజాన్ని ఏ విధంగా ముక్కలు చేస్తున్నారో చర్చించాలనుకున్నామన్నారు. పార్లమెంటులోనూ, వెలుపల ఈ అంశాలను లేవనెత్తాలనుకున్నామని, పార్లమెంటులో వీటిపై చర్చించేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. తమను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది నేటి భారత దేశ పరిస్థితి అని చెప్పారు.
దీనిపై బీజేపీ స్పందిస్తూ ‘‘మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న్యాయవ్యవస్థను కూడా పని చేయకుండా జడ్జిలను జైళ్లలో వేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇది వారికి జీర్ణం కావడం లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని నిందిస్తున్నారు’’ అని రవి శంకర్ ప్రసాద్ అన్నారు.
Article 370 Revocation: రద్దుకు మూడేళ్లు.. ఇప్పుడు కశ్మీర్ ఎలా ఉంది?