లాక్‌డౌన్ ట్రెండ్: క్వారంటైన్‌లో ఆడియో ‘పోర్న్’ ఎక్కువగా వింటున్నారట!

అంతా లాక్ డౌన్.. అందరూ హోం క్వారంటైన్ అయిపోయారు. బయటకు వచ్చేది లేదు. పోర్న్ ప్రియులకు క్వారంటైన్ సమయం బాగా కలిసొచ్చింది. అందుకే రోజుంతా ఆడియో పోర్న్ వినేందుకు ఆసక్తి చూపిస్తున్నారంట. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలామంది చెవుల్లో పోర్న్ ఆడియోనే వినపడుతోంది. Forbes ప్రకారం.. మార్చిలో క్వారంటైన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఆడియో పోర్న్ యాప్ ‘Dipsea’లో 84 శాతానికి పైగా సబ్ స్ర్కైబర్లు పెరిగారు. ప్రత్యేకించి మహిళల కోసం షార్ట్ ఆడియో స్టోరీలను ఈ యాప్ ఆఫర్ చేస్తోంది.
‘Dipsea’యాప్ సహా వ్యవస్థాపకుడు Gina Gutierrez మాట్లాడుతూ.. స్వీయ నిర్బంధంలో ఉన్న వారంతా బోర్ గా ఫీలయినప్పుడు ఒక కాపింగ్ మెకానిజంతో రూపొందిన యాప్ వాడకానికి భారీగా డిమాండ్ పెరిగిపోయిందని చెప్పారు. ఇయర్ బడ్స్ పెట్టుకుని దగ్గరగా ఆడియో వింటూ పోర్న్ వాయిస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుత కరోనా భయం నుంచి తమ దృష్టిని మరల్చేందుకు చాలామంది ఈ యాప్ వాడుతున్నారని ఆడియో పోర్న్ రైటర్ Devlin Wylde తెలిపారు.
Wylde వెబ్ సైట్లో వినిపించే ఈ వాయిస్ కోసం క్వారంటైన్లో ఉండే వారంతా విజిటర్లుగా ఉన్నారని అన్నారు. వెబ్ సైట్ విజిటర్లలో 6వేలు శాతం పెరిగినట్టు ఆయన తెలిపారు. పెయిడ్ సబ్ స్ర్కైబర్లలో 300 శాతం పెరిగినట్టు చెప్పారు. కస్టమ్ ఆడియ రిక్వెస్ట్ పొందినవారిలో 200 శాతం పెరిగినట్టు తెలిపారు. క్వారంటైన్ సమయంలోనే కాదు.. ఎప్పటినుంచో ఆడియో పోర్న్ కు పాపులారిటీ ఉంది.
లాక్ డౌన్ సమయంలో ఇదే లేటెస్ట్ పోర్న్ ట్రెండ్‌గా చెప్పవచ్చు. క్వారంటైన్ ప్రారంభమైనప్పటి నుంచి కరోనా వైరస్ థీమడ్ పోర్న్, పోర్న్ స్టార్లు ఇంటి నుంచే షూటింగ్ చేస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ పోర్న్ హబ్ క్యాంపైన్ నిర్వహిస్తున్నారు.
Read:క్వారంటైన్ సమయంలో కంటినిండా నిద్రపోవాలంటే?