Sudheer Babu : ఇంట్లో వాళ్ళు వద్దన్నారు.. కానీ కృష్ణ గారే..
ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు అందరూ వేదికపై మాట్లాడనున్నారు. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''నేను సినిమాల్లోకి వస్తాను అన్నప్ప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, చాలా మంది...........

Sudheer Babu emotional while speaking about krishna
Sudheer Babu : అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ చికిత్స పొందుతూ నవంబర్ 15వ తేదీన తుదిశ్వాస విడిచారు. నేడు కృష్ణ దశ దిన కర్మని శాస్త్రోక్తంగా ఘట్టమనేని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రాబోతున్న ప్రముఖులు, అభిమానుల కోసం ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు.
Pawan Kalyan : హరిహర వీరమల్లు కోసం పవన్ మళ్ళీ కరాటే నేర్చుకుంటున్నాడా?? వైరల్ అవుతున్న పవన్ ఫోటోలు..
ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు అందరూ వేదికపై మాట్లాడనున్నారు. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ”నేను సినిమాల్లోకి వస్తాను అన్నప్ప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, చాలా మంది ఎందుకు సినిమాల్లోకి అన్నారు. కానీ ఆ సమయంలో మామయ్య గారు ఒక్కరే ట్రై చేయనివ్వండి అన్నారు. నేను ఇప్పుడు హీరోగా నిలదొక్కుకోవడానికి మామయ్య గారే సపోర్ట్ ఇచ్చారు. నేనే కాదు మా ఫ్యామిలీ వాళ్లంతా సినిమాల్లో ఉన్నామంటే కృష్ణ గారే కారణం. ఆయనకి మేము ఎప్పటికి రుణపడి ఉంటాము” అని ఎమోషనల్ అయ్యారు.