Sunil – Saloni : సునీల్ – సలోని రచ్చ మామూలుగా లేదుగా!
పాపులర్ కమెడియన్ కమ్ హీరో సునీల్, కథానాయకుడిగా సరైన హిట్టు బొమ్మ పడకపోవడంతో మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన కామెడీ వైపు షిష్ట్ అయిపోయాడు..

Sunil Saloni
Sunil – Saloni: పాపులర్ కమెడియన్ కమ్ హీరో సునీల్, కథానాయకుడిగా సరైన హిట్టు బొమ్మ పడకపోవడంతో మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన కామెడీ వైపు షిష్ట్ అయిపోయాడు.. ఇటీవల ‘అరవింద సమేత’, ‘అల..వైకుంఠపురములో..’, నెగెటివ్ రోల్‌లో కనిపించిన ‘కలర్ ఫోటో’ సినిమాలతో ఆకట్టుకున్నాడు..
ఇప్పుడు సునీల్ ‘మర్యాద కృష్ణయ్య’ అనే సినిమా చేస్తున్నాడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ మంచి విజయం సాధించింది.. ఆ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సలోనితో మరోసారి జతకడుతున్నాడు సునీల్..
View this post on Instagram
షూటింగ్ స్పాట్‌లో సునీల్ – సలోని మాములు రచ్చ చెయ్యట్లేదసలు.. సలోని ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది.. అయితే రీసెంట్‌గా ‘దళపతి’ విజయ్ ‘మాస్టర్’ మూవీలోని పాపులర్ ‘వాతి కమింగ్’ పాటకు కాలు కదిపారు.. బేసిక్‌గా సునీల్ మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే.. తన స్టైల్లో స్టెప్స్ వేసి అలరించాడు.. సునీల్ – సలోని డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
View this post on Instagram