సూర్య లేకుండానే సినిమా స్టార్ట్ అయింది

సూర్య లేకుండానే సినిమా స్టార్ట్ అయింది

Updated On : February 15, 2021 / 4:44 PM IST

Suriya 40: తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రేక్షకాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా సోమవారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇటీవల కోవిడ్ బారినపడ్డ సూర్య ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే ఈ కార్యక్రమానికి ఆయన రాలేదు.

Suriya 40

సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. టాలెంటెడ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్, ప్రియాంక అరుల్ మోహన్‌తో పాటు మిగతా యూనిట్ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Suriya 40

సూర్య నటిస్తున్న 40వ సినిమా ఇది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో జాయిన్ అవుతారు. లాక్‌డౌన్ టైంలో సూర్య, సుధా కొంగర కలయికలో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

Suriya 40

Suriya 40