T20 World Cup 2022: జింబాబ్వే ఆలౌట్.. 71 పరుగులతో టీమిండియా ఘన విజయం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా 71 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు బాదారు.

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా 71 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు బాదారు.
కేఎల్ రాహుల్ 51, కెప్టెన్ రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 26, సూర్యకుమార్ యాదవ్ 61 (నాటౌట్) , రిషబ్ పంత్ 3, హార్దిక్ పాండ్యా 18, అక్షర్ పటేల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో జింబాబ్వే ముందు నుంచీ తడబడింది. సికందర్ రజా 34, రియాన్ బర్ల్ 35 మినహా మిగతా జింబాబ్వే బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేకపోయారు.
దీంతో 17.2 ఓవర్లలో 115 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, షమీ, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ కు ఒక్కో వికెట్ దక్కాయి. అంతకు ముందు జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ 2, బ్లెస్సింగ్ ముజారబానీ, సింకదర్ రజా చెరో వికెట్ తీశారు. టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరింది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..