T20 World Cup 2022: ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోర ఓటమి.. నెట్టింట్లో పేలుతున్న జోకులే జోకులు ..

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన క్రికెట్ అభిమానులు నవ్వులు పూయించే వీడియోలతో టీమిండియా ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

T20 World Cup 2022: ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోర ఓటమి.. నెట్టింట్లో పేలుతున్న జోకులే జోకులు ..

T20 World Cup

Updated On : November 10, 2022 / 7:33 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా జట్టు ఘోర ఓటమిపాలైంది. కనీసం ఇంగ్లాండ్ బ్యాటర్లను ఒక్కరినికూడా టీమ్ ఇండియా బౌలర్లు ఔట్ చేయలేక పోయారు. ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించి ఫైనల్లో పాకిస్థాన్ జట్టుతో తలపడుతుందని ఆశగా ఎదురుచూసిన ఇండియాలోని క్రికెట్ అభిమానులు ఆటగాళ్ల పేలువ ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో టీమ్ ఇండియా ఆటతీరుపై జోకులు పేలుతున్నాయి.