Andhra Techie: పాకిస్తాన్ నుంచి ఇండియాకు తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
2019లో అక్రమంగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించి అరెస్టయిన 32 ఏళ్ల తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సోమవారం వాఘా సరిహద్దు మీదుగా భారత్‌కు అప్పగించింది పాకిస్తాన్ ప్రభుత్వం.

Techie From Andhra Repatriated By Pakistan Via Wagah Border
Andhra Techie repatriated: 2019లో అక్రమంగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించి అరెస్టయిన 32 ఏళ్ల తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సోమవారం వాఘా సరిహద్దు మీదుగా భారత్‌కు అప్పగించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రాజమ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ప్రశాంత్ వైన్‌దామ్ 2017లో ఆన్‌లైన్ ప్రియురాలి కోసం వెళ్లి పాకిస్తాన్‌లో చిక్కుకున్నాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన వారీ లాల్‌తో పాటు ప్రశాంత్ వైన్‌దామ్‌ను నవంబర్ 14, 2019 న పాకిస్తాన్‌లో అరెస్టు చేశారు. ప్రశాంత్ పాక్ అధికారులకు చిక్కిన తర్వాత తండ్రి బాబూరావు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి, తన కుమారుడిని విడిపించేలా చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్‌ను తిరిగి స్వదేశానికి రప్పించింది భారత ప్రభుత్వం.
తన ఆన్‌లైన్ ప్రియురాలిని కలవడానికి స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకున్న ప్రశాంత్, తప్పిపోయి పాకిస్తాన్ చేరుకున్నారు. రెండేళ్ల తర్వాత పాకిస్తాన్ పోలీసులు 2019లో అరెస్ట్ చేశారు. ప్రశాంత్ అరెస్ట్ అయ్యాక, అతని వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ అయ్యింది. వీడియోలో, ప్రశాంత్ తెలుగులో మాట్లాడుతూ, తనను పాకిస్తాన్‌లో అరెస్టు చేసినట్లు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఫార్మాలిటీలు పూర్తి చేసి భారత ప్రభుత్వం ప్రశాంత్‌ను విడుదల చేయించింది. బెంగళూరుకు చెందిన కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు ప్రశాంత్.
10టీవీ తో ప్రశాంత్ సోదరుడు శ్రీకాంత్:
నాలుగేళ్ల పోలీసుల కృషితో మా తమ్ముడు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని 10టీవీతో అన్నారు ప్రశాంత్ సోదరుడు శ్రీకాంత్. పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన నా తమ్ముని తిరిగి క్షేమంగా తీసుకొచ్చినందుకు పోలీసులకు, ఈ విషయంలో కీలక పాత్ర పోషించించేందుకు మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు.