Tejaswi Madivada : ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కమిట్‌మెంట్‌ అడగలేదు.. నేను పెళ్లి చేసుకోను..

తేజస్వి కమిట్మెంట్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో నన్ను అయితే ఎవరూ కమిట్‌మెంట్‌ అడగలేదు. అందరూ నాతో కూల్‌గానే ఉన్నారు. ఒకవేళ నన్ను కమిట్‌మెంట్‌ అడగాలి అన్నా...........

Tejaswi Madivada : ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కమిట్‌మెంట్‌ అడగలేదు.. నేను పెళ్లి చేసుకోను..

tejaswi madivada

Updated On : August 15, 2022 / 9:20 AM IST

Tejaswi Madivada :  సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో చిన్న పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మడివాడ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. బోల్డ్ పాత్రల్లో నటించి, సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలని పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తుంది తేజస్వి. బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా కమిట్మెంట్ అనే ఓ సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది.

Shruthika Samudrala : ది సింగింగ్ సూపర్ స్టార్.. సరిగమప షో విన్నర్ శృతిక సముద్రాల..

తేజస్వి కమిట్మెంట్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో నన్ను అయితే ఎవరూ కమిట్‌మెంట్‌ అడగలేదు. అందరూ నాతో కూల్‌గానే ఉన్నారు. ఒకవేళ నన్ను కమిట్‌మెంట్‌ అడగాలి అన్నా భయపడేవాళ్లు. నాకు ఇప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే చాలా మంది అక్క, చెల్లి క్యారెక్టర్స్‌ అని చెబుతున్నారు. లేదంటే బోల్డ్‌ క్యారెక్టర్స్‌ తీసుకొస్తున్నారు. అందుకే ఎక్కువగా సినిమాలు ఒప్పుకోవట్లేదు. కేరింత లాంటి మంచి క్యారెక్టర్స్‌ ఎవరూ ఇవ్వడం లేదు. ఇంట్లో పెళ్లి చేసుకోమని చెప్తూనే ఉంటారు. పెళ్లి చేసుకోవాలంటే సినిమాలు మానేయాలని చెప్పారు. అందుకే పెళ్లి చేసుకోను అని చెప్పాను” అని తెలిపింది.